అల్లు శిరీష్ - సురభి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఒక్క క్షణం'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రచార చిత్రాలతో బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. పేర్లల్ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వనుంది. ఒక జంట పాస్ట్‌లో జరిగిన ఇష్యూస్, మరో జంట ఫ్యూచర్‌కి ఎలా కనెక్ట్ అవుతుందనే కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వి.ఐ.ఆనంద్ సినిమాల్లో ఉండే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇదే. గతంలో తెరకెక్కిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఎంచుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన మ్యాజిక్‌ని రిపీట్ చేయనున్నాడు డైరెక్టర్ వి.ఐ.ఆనంద్.
లవ్ వెర్సస్ డెస్టినీ అనే క్యాప్షన్‌తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా తర్వాత నటిస్తున్న సినిమా ఇదే. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అల్లు శిరీష్‌కి 'ఒక్క క్షణం' మంచి గుర్తింపు తెచ్చి పెట్టనుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో హీరోగా తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందంటున్నాడు శిరీష్. ఇంతవరకూ ఇలాంటి స్టోరీతో సినిమా వచ్చి ఉండదేమో అనే భావన కలుగుతుందట చూసే ప్రేక్షకుడికి ఈ సినిమా చూస్తున్నంత సేపు.
అలాంటి కొత్త తరహా కథతో తెరకెక్కుతోన్న చిత్రమే అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి తెరకెక్కించాడు డైరెక్టర్ వి.ఐ ఆనంద్. విభిన్న హీరోగా పేరు తెచ్చుకోవాలన్నదే శిరీష్ టార్గెట్. అందుకే ఇలాంటి విభిన్నమైన కథా చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ముద్దుగుమ్మ సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూఎస్ ప్రీమియర్స్ నుండి వస్తున్న రిపోర్ట్స్ పోజిటివ్ టాక్‌ని అందిస్తున్నాయి. భిన్న కథాంశంతో వస్తోన్న ఈ సినిమాతో శిరీష్‌కి ఆడియన్స్ ఎంత మేర విజయాన్ని కట్టబెడతారో చూడాలిక.