మంచు మనోజ్ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఒక్కడు మిగిలాడు చిత్రం ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.
అయితే ఒక్కడు మిగిలాడు కథ శ్రీలంకలో తమిళుల అస్థిత్వం కోసం పోరాడిన ప్రభాకరన్ జీవితాన్నిఆధారం చేసుకొని తీసిన చిత్రం కావడం ఇప్పుడు సెన్సార్ నుండి అభ్యంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ప్రభాకరన్ బ్రతికున్నంత కాలంలో మన దేశం పైన వ్యతిరేకతతో ఉండడం అలాగే మాజీ ప్రధాని హత్యకి కుట్ర పన్నిన నేపధ్యం ఉండడం ఈ చిత్రానికి చిక్కులు తెచ్చే అంశాలు గా భావిస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో ఈ చిత్రం పై సెన్సార్ బోర్డు ఎలా ఉండనుందో చూడాలి.