ఎప్పటి నుంచో సరైన హిట్ లేక కెరియర్ ఒడిదుడుకుల్లో ఉన్న సందీప్ కిషన్ కి 'ఊరు పేరు భైరవకోన' తో హిట్ దక్కింది అని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వీఐ ఆనంద్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్ లుగా నటించగా, శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.
ఈ సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి పోటీగా ఏవి లేకపోవటం, ఈ కథ, కథనం ఇంట్రస్ట్ గా ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఊరు పేరు భైరవకోన ప్రీమియర్ షోల తర్వాత తిరుగులేని పాజిటివ్ టాక్ తో, ఆడియన్స్ రెస్పాన్స్ తో రెండు రోజులకే అద్భుతమైన వసూళ్లు సాధించినా,వీకెండ్ కావటంతో మూడోరోజు కూడా కలెక్షన్లు ఎక్కువగా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా.
తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 6.03 కోట్లు రాబట్టగా, రెండో రోజున 7.07 కోట్లు వసూలు చేసింది. రెండు రోజుల మొత్తం 13.10 కోట్లు వసూల్ చేసింది . ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ నైజాంలో 3 కోట్లు, సీడెడ్‌లో 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కలిపి 4.40 కోట్లకు అమ్ముడు పోయింది. మిగిలిన రాష్ట్రాలైన కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి 1.50 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా 10.20 కోట్లు బిజినెస్ అయింది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. టోటల్గా ఈ సినిమాకు తెలుగులోనే 19.50 కోట్లు బిజినెస్ జరిగింది.