ఓటీటీ సంస్థల మధ్య పోటీ ఎక్కువైంది. చిన్న సినిమాలకు సైతం మంచి రేట్లు వస్తున్నాయి. ఇటీవల డబ్బింగ్ సినిమాలతో హోరెత్తించిన `ఆహా` ఇప్పుడు రూటు మార్చింది. స్ట్రయిట్ సినిమాల్ని కొనడానికి మొగ్గు చూపిస్తోంది. ఒరేయ్ బుజ్జిగా, కలర్‌ఫొటో సినిమాల హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలకూ మంచి రేట్లే గిట్టుబాటు అయ్యాయని సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. అక్టోబరు 2న ఆహాలో విడుదల కాబోతోంది.
ఈసినిమాని 4 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్. మరోవైపు `కలర్‌ఫొటో` కూడా ఆహాలోనే విడుదల కాబోతోంది. అక్టోబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈసినిమాని దాదాపు 3 కోట్లకు కొన్నట్టు టాక్. ఈ సినిమా బడ్జెట్ 1.5 కోట్లే. దానికి రెట్టింపు ఓటీటీ ద్వారా వస్తోందన్నమాట. మొత్తానికి ఈ రెండు సినిమాలకూ మంచి రేట్లు వచ్చినట్టే. ఇవి కాకుండా ఆహా మరికొన్ని సినిమాల హక్కుల్ని చేజిక్కించుకున్నట్టు టాక్. వాటికి సంబంధించిన వివరాలు త్వరలోనే.. ఆహా బయటపెట్టబోతోంది.