ఒసాకా తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ లో కోలీవుడ్ సినిమాల హావా. జపాన్ దేశంలో ఒసాకా నగరంలో ఈ వేడుక జరిగింది. కోలీవుడ్-జపాన్ చిత్ర పరిశ్రమల మధ్య స్నేహ బంధాన్ని పెంపొందించే విధంగా, ఈ ఫెస్టివల్ జరుగుతుంది. 2022 లో వచ్చిన తమిళ చిత్రాలకి అవార్డ్స్ ప్రకటించారు. ఇందులో 'పొన్నియన్ సెల్వన్', 'విక్రమ్' సినిమాలు వివిధ విబాగాల్లో అవార్డ్స్ దక్కించుకున్నాయి. లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాకి అత్యధికంగా ఎనిమిది అవార్డ్స్ వచ్చాయి. విక్రమ్ తరవాత మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాకి ఏడు అవార్డ్స్ వచ్చాయి.
ఇప్పటికే పలు అవార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కమల్ ఇప్పుడు విక్రమ్ సినిమాకి ఒసాకా తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు అందుకుంది. తమిళంలో వచ్చిన సాని కాయితం అనే సినిమాకి కీర్తి ఈ అవార్డ్ దక్కించుకుంది. ఈ మూవీ తెలుగులో చిన్నిగా డబ్బింగ్ అయ్యింది. ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్రలో నటించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఐశ్వర్యారాయ్ పొన్నియన్ సెల్వన్ సినిమాకి అవార్డు అందుకుంది. బెస్ట్ విలన్ గా విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాకి గాను అవార్డు అందుకున్నారు.
ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాకి అవార్డు అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుద్ 'విక్రమ్' సినిమాకి నిలిచాడు. బెస్ట్ ఎంటర్ టైనర్ గా లవ్ టుడే నిలిచింది. లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాకి గాను, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ బీస్ట్ సినిమా లో అరబిక్ కుతు పాట గాను అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ రవివర్మన్ పొన్నియన్ సెల్వన్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ రత్నకుమార్, అవార్డ్స్ అందుకున్నారు.