హేమ వెనక ఎవరున్నారు?

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హేమ పేరు మారు మోగిపోతోంది. అయితే అది సినిమాల పరంగా కాదు, రేవ్ పార్టీ విషయంలో. తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా  ట్రెడిషనల్ గా కనిపించే హేమ ఇలా రేవ్ పార్టీలకి వెళ్ళటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాద్ కి చెందిన వాసు అనే బిల్డర్ బెంగుళూర్లోని ఒక ఫామ్ హౌస్ లో తన పుట్టినరోజు వేడుకల్లో  భాగంగా ఈ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఆ పార్టీలో టాలీవుడ్ కి చెందిన మోడల్స్, నటీ నటులు, కొందరు పొలిటీషన్స్ ఉన్నట్లు సమాచారం. కానీ ఎవరి పేర్లు పెద్దగా బయటికి రాలేదు. ఒక్క హేమ పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తోంది. కానీ తానూ హైదరాబాద్ లో ఉన్నట్లు, రేవ్ పార్టీకి వెళ్లలేదని, నమ్మించాలని హేమ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.


హేమ ఆ పార్టీలో ఉండటమే కాదు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనితో బెంగుళూర్ పోలీసులు ఆమెకి మే 27న విచారణకి రావాలని నోటీసులిచ్చారు. కానీ హేమ వైరల్ ఫీవర్ అని చెప్పి విచారణకి వెళ్లకుండా ఎగ్గొట్టింది. హేమకి ఇంత దైర్యం ఎలా వచ్చింది. ఏంక్వైరీ కి రమ్మని నోటీసులిచ్చినా ఎలా  డుమ్మా కొట్టింది అని సర్వత్రా చర్చనియాంశం అవుతోంది. బెంగుళూర్ పోలీసులు హేమని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవారని, రేవ్ పార్టీ లో పట్టుబడినప్పుడు, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినప్పుడు అరెస్ట్ చేయాలి కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మరికొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 


హేమ అరెస్ట్ కాకుండా ఉండటానికి కారణం, ఏపీ పొలిటీషన్స్ అని టాక్. హేమని అరెస్ట్ చేయకూడదని, విచారణకి కూడా రాదని ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు బెంగుళూరు పోలీసులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ పొలిటీషన్స్ ఒత్తిడి వలన బెంగుళూర్ పోలీసులు హేమ విషయంలో లిబరల్ గా ఉంటున్నారని సమాచారం. ఇదే విషయం కన్నడ మీడియా కూడా కోడై కూస్తోంది. ఈ రేవ్ పార్ట్ లో ఏపీ వైకాపా నాయకుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS