'నా జిందగీ.. పిచాక్‌' హోరెత్తిస్తోన్న 'హుషారు'.!

మరిన్ని వార్తలు

'నా జిందగీ.. పిచాక్‌'

 

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌కి ఇప్పుడు క్రేజ్‌ మామూలుగా లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వన్స్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యిందంటే చాలు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రమోషన్స్‌ హోరెత్తిపోతున్నాయంతే. తాజాగా ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ముచ్చట్లు ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అదే 'హుషారు' మూవీ. ఇందులో హీరో హీరోయిన్స్‌గా నటించే కుర్రోళ్లు, కుర్రదాని పేర్లు ఏంటా అనే విషయం పక్కన పెడితే, ఓ మోస్తరు పరిచయం ఉన్న రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నాడు. అది సినిమాకి వెరీ వెరీ ఇంపార్టెంట్‌ రోలే. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా నుండి ఓ ప్రమోషన్‌ సాంగ్‌ని బయటికి వదిలారండీ. ఆ సాంగ్‌ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. 

 

యూత్‌కి కాకపోతే ఇలాంటి సాంగ్‌ కాన్సెప్ట్‌ ఇంకెవ్వరికి కనెక్ట్‌ అవుతుంది చెప్పండి. అందుకే ఏరి కోరి ఈ సాంగ్‌ని వదిలినట్లున్నారు. 'నా జిందగీ.. పచాక్‌' అంటూ బీటెక్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రోడి కష్టాల్ని సింపుల్‌గా వెరీ కనెక్టివ్‌గా ఒకే ఒక సాంగ్‌లో చెప్పేయడమే కాదు, చూపించేశారు. కరెక్ట్‌గా అక్కడే యూత్‌ కనెక్ట్‌ అయిపోతోంది మరి. విడుదలైన కొన్ని నిమిషాలకే ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ 'హుషారు' మూవీ డిశంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఫసక్‌ హిట్‌ ..'కాదు కాదు, 'పిచాక్‌ హిట్‌' కట్టబెట్టేస్తారేమో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS