'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'... ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి

By iQlikMovies - December 22, 2018 - 18:08 PM IST

మరిన్ని వార్తలు

ఏ సినిమాకైనా ప్రారంభ వ‌సూళ్లు చాల కీల‌కం. ఓపెనింగ్స్ బాగుంటే... ద‌ర్శ‌క నిర్మాత‌ల క‌ళ్ల‌లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆ సినిమాపై మ‌రింత భ‌రోసా ఏర్ప‌డుతుంది. ఈవారం విడుద‌లైన సినిమాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా... `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` నిలిచింది. శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలిరోజు రూ.1.82 కోట్లు (షేర్‌) సాధించింది. 

 

శ‌ర్వా కెరీర్‌లో ఇది రెండో అత్య‌ధిక ఓపెనింగ్ అనుకోవాలి. మ‌హానుభావుడుకి రూ.2.6 కోట్లు వ‌చ్చాయి. ఆ త‌ర‌వాత ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వ‌చ్చిన సినిమా ఇదే.  నైజాంలో 60 ల‌క్ష‌లు తెచ్చుకున్న ఈ చిత్రం గుంటూరులో రూ.30 ల‌క్ష‌లు ద‌క్కించుకుంది. సీడెడ్‌లో రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌చ్చాయి. అమెరికాలో రూ22 ల‌క్ష‌లు మాత్ర‌మే ద‌క్కించుకుంది. శ‌నివారం, ఆదివారం వ‌సూళ్ల‌పై ఈ సినిమా భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. దాదాపుగా రూ.22 కోట్ల వ‌ర‌కూ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అదంతా రాబ‌ట్టాలంటే ఈ సినిమా ఏదో ఓ మ్యాజిక్ చేయాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS