విజ‌య్ దేవరకొండ కౌంట‌ర్లు ఎవ‌రిపై..??

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో విజ‌య్ దేవర‌కొండ ఇమేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. `నోటా` కి వ‌చ్చిన ఓపెనింగ్స్ చూస్తే విజ‌య్ స్థాయి అర్థ‌మ‌వుతుంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. విజ‌య్ అభిమానుల్ని సైతం తీవ్రంగా నిరాశ ప‌రిచింది. 

తొలి రోజు చూసిన వ‌సూళ్లు... రెండో రోజు వ‌చ్చేస‌రికి అమాంతంగా ప‌డిపోయాయి. విజ‌య్‌ని విమ‌ర్శించే వాళ్లు ఎక్కువ‌య్యారు. విజ‌య్ విజ‌యాల్ని న‌డ‌మంత్ర‌పు సిరి అన్న‌ట్టు చూపించారు.  కొంత‌మంది టాలీవుడ్ హీరోలు ఈ ఫ్లాప్ చూసి పార్టీలు చేసుకున్నార‌న్న రీతిలో వార్త‌లు పుట్టాయి.

ఇప్పుడు ఈ ఫ్లాప్‌పై విజ‌య్ స్పందించాడు.  నోటా లాంటి సినిమా చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని, ఈ చిత్రాన్ని ఆద‌రించిన‌వాళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నాడు. న‌చ్చ‌ని వాళ్ల కామెంట్లు కూడా తాను సీరియెస్‌గానే తీసుకున్నాన‌ని, ఆ త‌ప్పుల్ని ఇక మీద‌ట చేయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాన‌ని, ఈసారి ఓ మంచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాన‌ని మాట ఇచ్చాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఆ త‌ర‌వాత చేసిన కామెంట్లే ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. నా ఫ్లాప్ చూసి ఎంజాయ్ చేసేవాళ్లు పండ‌గ చేసుకోండి - ఎందుకంటే ఈ అవ‌కాశం మ‌ళ్లీ రాదేమో.. అని చుర‌క అంటించాడు. 

ఇది క‌చ్చితంగా విజ‌య్‌ని చూసి, అత‌ని ఎదుగుద‌ల‌ని చూసి కుళ్లుకునే కొంత‌మంది యువ హీరోల‌కు విజ‌య్ ఇచ్చిన కౌంట‌ర్ అని... టాలీవుడ్ జ‌నాలు చెప్పుకుంటున్నారు. `నా ఎటిట్యూడ్ మార్చుకోను. ఇది ఓ సినిమాకి వ‌చ్చి, మ‌రో సినిమాకి పోయేది కాదు. నేను ఇలానే ఉంటా. నాలానే ఉంటా` అంటూ... ప్ర‌క‌టించాడు విజ‌య్‌.  ఈ కామెంట్లు, ఫ్లాప్ వ‌చ్చిన త‌ర‌వాత కూడా విజ‌య్ చూపిస్తున్న ఎటిట్యూడ్ చూస్తుంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది.  "" విజ‌య్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో `టాక్సీవాలా` విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS