ఇది 'సూర్య' గాడి వీర ప్రేమగాధ.!

By iQlikMovies - December 14, 2018 - 17:49 PM IST

మరిన్ని వార్తలు

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు డైరెక్టర్‌ హను రాఘవపూడి. ఫుల్‌ ఎఫర్ట్‌ పెట్టి చేసిన సినిమా అది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కానీ, లవ్‌స్టోరీని అద్భుతంగా తెరకెక్కించిన వైనం కానీ అదరహో అనిపించాయి. అందుకే ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. అదే కాన్ఫిడెన్స్‌తో రెండో సినిమా 'లై'ని తెరకెక్కించాడు. కానీ కన్‌ఫ్యూజింగ్‌ కథా, కథనాలతో అనుకున్న స్టోరీని అనుకున్నట్లు తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ఇప్పుడీ యంగ్‌ డైరెక్టర్‌ ముచ్చటగా మూడో సినిమాతో వస్తున్నాడు.

అదే 'పడి పడి లేచె మనసు'. శర్వానంద్‌ హీరో. సాయి పల్లవి హీరోయిన్‌. కాగా లేటెస్టుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. 'నా పేరు సూర్య.. నా పేరులో ఉన్న వెలుగు నా జీవితంలో మిస్సై సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది పాటు నేను చీకట్లో చేసిన యుద్దంలో ఇంకా నేను బతికున్నానంటే అందుకు కారణం వైశాలి..' అంటూ శర్వానంద్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ స్టార్ట్‌ అయ్యింది. ట్రైలర్‌ టాక్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమా పూర్తిగా సూర్య అమర వీర ప్రేమగాధగానే అభివర్ణించాలి. కోల్‌కత్తా బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

కోల్‌కత్తా లొకేషన్స్‌, అక్కడక్కడా మంచు కొండల లొకేషన్స్‌ ఇలా ట్రైలర్‌ని గ్రాండియర్‌ లుక్‌లో కట్‌ చేశారు. సాయి పల్లవి తనదైన నేచురల్‌ పర్‌ఫామెన్స్‌ని మరోసారి ప్రదర్శించింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ వంటి వారితో కామెడీ టచ్‌ ఇచ్చారు. హీరో, హీరోయిన్స్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ చూపించి, సడెన్‌గా నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే డైలాగ్‌ హీరోయిన్‌ చేత చెప్పించి, చివరికి 'హలో మేడమ్‌ పడనేమోనని భయపడకండి. మిమ్మల్ని పడేసే బాధ్యత నాది..' అంటూ శర్వానంద్‌ డైలాగ్‌తోనే ట్రైలర్‌ ఎండ్‌ అయ్యింది. అసలింతకీ శర్వా, సాయి పల్లవి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఈ నెల 21 వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS