'తస్సదియ్యా' ఇదేరా స్టైల్‌ అంటే.!

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వినయ విధేయ రామ' నుండి సెకండ్‌ ఆడియో సింగిల్‌ రానుంది. 'తస్సదియ్యా..' అంటూ సాగే ఈ ఆడియో సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. పోస్టర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అద్దిరిపోయింది. చరణ్‌, పక్కనే ముద్దుగుమ్మ కైరా అద్వానీ జంట చూడ చక్కగా ఉంది. కైరా వంపులు, చరణ్‌ స్టైలింగ్‌ టోటల్‌గా ఈ స్టిల్‌ సూపర్బ్‌గా ఉంది.

తొలి సాంగ్‌ ఫ్యామిలీ సాంగ్‌ అయితే ఇది రొమాంటిక్‌ డ్యూయెట్‌ అనిపిస్తోంది. కైరా అద్వానీ మంచి డాన్సర్‌. తొలి సినిమా 'భరత్‌ అనే నేను'తోనే అది ప్రూవ్‌ చేసుకుంది. అయితే కైరా టాలెంట్‌కి తగ్గ డాన్సింగ్‌ పాట్నర్‌ చరణ్‌. సో ఈ ఇద్దరూ ఆన్‌ స్క్రీన్‌ డాన్సులు ఇరగదీసేసి ఉంటారని చెప్పడానికి ఈ స్టిల్‌ ఒక్కటి చాలు. మొత్తానికి 'వినయ విధేయ రాముడి' నుండి మాంచి ఊపున్న సాంగ్‌ రాబోతోందని తెలిసిపోయింది.

ఎప్పుడనేది డేట్‌ చెప్పనే లేదు కదా. ఈ నెల 17 సాయంత్రం 4 గంటలకు ఈ ఆడియో సింగిల్‌ విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. డివివి దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మాస్‌ మసాలా డైరెక్టర్‌ బోయపాటి శీను తెరకెక్కిస్తున్నారు. సీనియర్‌ హీరోలు ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS