రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
సినిమాల విషయానికి వస్తే ముగ్గురు సినీ ప్రముఖులు పద్మా అవార్డులని అందుకున్నారు. నాటునాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని సాధించిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ అవార్డ్ లభించింది. అలాగే ప్రముఖ గాయని వాణీ జయరాం పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ సినియర్ హీరోయిన్ రావీన టాండన్ కు పద్మశ్రీ వరించింది. ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, రధసారధి, పాండవులు పాండవులు తుమ్మెద, కేజీఎఫ్ 2 చిత్రాలతో తెలుగు వారికి రవీనా టాండన్ పరిచయం.