పద్మావతి చిత్రం విడుదలకి తీవ్ర అడ్డంకులు

మరిన్ని వార్తలు

సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన పద్మావతి చిత్రం పైన ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని విడుదల కానివ్వకుండా చూడాలని ఏకంగా ప్రధాన మంత్రికే లేఖలు రాస్తున్న పరిస్థితి నెలకొంది.

వివరాల్లోకి వెళితే, ఉదయపూర్ కి చెందిన మేవార్ రాజవంశస్థులు తమని సంప్రదించకుండా పద్మావతి చిత్రాన్ని ఎలా తీస్తారు అని ప్రశ్నించారు అలాగే ఈ చిత్రాన్ని దర్శకుడికి నచ్చినట్టుగా తీయడానికి కుదరదు అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు.  

అందుకే ఈ చిత్ర విడుదల ఆపాలని ప్రధానమంత్రికి, సెన్సార్ బోర్డు చీఫ్ కి, సమాచార ప్రసార శాఖ మంత్రికి, లేఖలు రాశారు సదరు రాజ వంశీకులు.

మొత్తానికి ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది అడ్డంకులు కూడా పెరిగిపోతున్నాయి.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS