దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పద్మావతి' చిత్రం ఎన్ని వివాదాలు ఎదుర్కుందో ఈ మధ్య తెలిసిన సంగతే. చిత్ర యూనిట్‌పై రాజ్‌పుత్ కర్ణిసేన దాడికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజ్‌పుల్ రాణి 'పద్మావతి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాణీ పద్మావతి చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలపై ఈ వివాదాలు తలెత్తాయి. దాంతో సినిమా సెన్సార్ కాకుండానే విడుదల ఆగిపోయింది.
అయితే తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని సమీక్షించే బృందంలో రాజస్థాన్‌కి చెందిన ఇద్దరు ప్రొఫెసర్స్‌ని ఆహ్వానించింది. స్థానిక అగర్వాల్ కళాశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.ఎస్. కంగరాట్, రాజస్థాన్ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫిసర్ బి.ఎల్. గుప్తాలకు సెన్సార్ బోర్డ్ నుండి ఆహ్వానం వచ్చినట్లు వారు తెలిపారు. సినిమాపై వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్షా బృందం సెన్సార్ బోర్డ్‌కి తగిన సూచనలు సలహాలు ఇవ్వనుందనీ సమాచారమ్. సినిమా సెన్సార్ అయ్యాక ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే సెన్సార్ బోర్ట్ ఈ ముందు జాగ్రత్త తీసుకుందని తెలియవస్తోంది. వివాదాల కారణంగా డిశంబర్ 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగిపోయింది. అయితే ఈ చిత్ర నిర్మాతలకు సినిమాని ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై స్పష్టమైన క్లారిటీ లేదనే తెలుస్తోంది.
చూడాలి మరి స్పెషల్ సమీక్షా బృందం సహాయంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ఎన్ని కత్తెరలు విధిస్తుందో.. ఏ సర్టిఫికెట్ ఇస్తుందో! సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికాతో పాటు షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ఇతర ముఖ్య తారాగణంగా నటించారు.