నేను ప్రబాస్‌కి పెద్ద ఫ్యాన్‌ని - సురభి

మరిన్ని వార్తలు

'ఎక్స్‌ప్రెస్‌ రాజా' సినిమా టైంలో ప్రబాస్‌ ముద్దుగుమ్మ సురభిని అభినందించాడట. ఆ సినిమా ఈ బ్యూటీకి మంచి విజయం అందించింది. అందుకే ప్రబాస్‌చే ప్రశంసలు అందుకుంది. అప్పటి నుండీ సురభి ప్రబాస్‌కి పెద్ద ఫ్యాన్‌ అయిపోయిందట. తాజాగా 'ఒక్క క్షణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

'బీరువా' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ కెరీర్‌లో 'జెంటిల్‌మెన్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' వంటి సక్సెస్‌లున్నప్పటికీ, నటన పరంగా పెద్దగా మార్కులేయించుకోలేకపోయింది. కానీ తాజా చిత్రం 'ఒక్క క్షణం'తో సక్సెస్‌ని అందుకోవడంతో పాటు, నటన పరంగా మంచి మార్కులు కూడా కొట్టేసింది. గత చిత్రాలతో పోల్చితే, ఈ సినిమాలో సురభి యాక్టింగ్‌లో పరిణీతి చెందిందనీ టాక్‌ వస్తోంది. దాంతో ఈ ముద్దుగుమ్మ దశ తిరిగినట్లే అనుకోవాలి. లక్కుంది కానీ, యాక్టింగ్‌ లేకపోతే ఎలా? కానీ అతి త్వరలోనే ఈ అందాల భామ ఆ డిఫెక్ట్‌ని అధిగమించేసింది. 

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన 'ఒక్క క్షణం' సినిమాకి వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహించారు. పేర్లల్‌ లైఫ్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా సురభి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంది. అందుకు తగ్గట్లుగానే పాత్రకి తగ్గ న్యాయం చేసిందంటూ గుడ్‌ కాంప్లిమెంట్స్‌ అందుకుంటోంది సురభి. అసలే ఇప్పుడొస్తున్న ముద్దుగుమ్మలు తొలి ప్రయత్నంతోనే యాక్టింగ్‌ టాలెంట్‌ ప్రదర్శించి, ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. 

అలాంటిది మూడు నాలుగు చిత్రాలు చేసిన అనుభవం ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇంకెంతలా టాలెంట్‌ చూపించాలి? ఈ సినిమాతో అందులో సక్సెస్‌ అయ్యింది. కాగా మహేష్‌బాబుని 'ట్రూ సూపర్‌స్టార్‌' అని పొగిడేస్తోంది సురభి. ఎన్టీఆర్‌తో డాన్సులేయాలనిపిస్తోందంటోంది. అలాగే రామ్‌చరణ్‌తో ఛాన్స్‌ వస్తే అస్సలు వదులుకోనంటోంది. ఈ లక్కీ బ్యూటీ అనుకున్నట్లే తన కోరికలన్నీ నెరవేరాలని ఆశిద్దాం!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS