సెప్టెంబర్ పెద్ద సినిమాల యుద్ధానికి వేదికగా మారుతోంది. సెప్టెంబర్‌లో దసరా సెలవులు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద పండగనే తీసుకు రానున్నాయి. ఈ సెలవుల్ని క్యాష్ చేసుకోడానికి పెద్ద సినిమాలు లైన్‌లోకి వచ్చేశాయి. సినిమా ప్రారంభించినప్పుడే పూరి జగన్నాథ్, బాలకృష్ణతో రూపొందిస్తున్న సినిమా డేట్‌ని అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమాకి 'పైసా వసూల్' అనే టైటిల్‌ని పెట్టి, ముందుగానే ఈ సినిమా భవిష్యత్‌ని అంచనా వేసేశాడు పూరీ. సెప్టెంబర్ 29న 'పైసా వసూల్' సినిమా విడుదల కానుంది. ఇంకో వైపున మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పైడర్' సెప్టెంబర్ 27న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరో వైపున ఎన్టీయార్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై లవకుశ' సెప్టెంబర్ 21న రిలీజ్ డేట్ కన్‌ఫామ్ చేసుకున్నట్లు సమాచారమ్. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఆ కారణంగా ఈ సినిమా పైనా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఈ రకంగా మూడు పెద్ద సినిమాలు ఒకే పండక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేయనున్నాయి. అంటే పోటీ ఏ రకంగా ఉండనుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి ఇదే తరహాలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ముగ్గురు సీనియర్ హీరోలు పోటీపడ్డారు. ఇదే తరహాలో ఈ దసరాకి కూడా సినీ యుద్ధం తప్పకపోవచ్చు. గెట్ రెడీ ఫర్ దిస్ వార్!