బాలయ్య 101వ చిత్రం పైసా వసూల్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ ని కొత్తగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూరి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఇక మొదటిరోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పరంగా బాగానే ఉన్నా ఈ చిత్రం మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అమెరికాలో అయితే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అంతగా రాలేదు, పైగా అర్జున్ రెడ్డి చిత్రంతో పోల్చితే కలెక్షన్స్ పరంగా బాగా వెనక పడినట్టే సమాచారం అందుతున్నది.
అయితే ఓవర్సీస్ లో బాలయ్యకి మార్కెట్ తక్కువగా ఉండడం కూడా ఈ కలెక్షన్స్ తక్కువగా రావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఈవారం ఓవర్సీస్ లో లాంగ్ వీకెండ్ కావడం పైసా వసూల్ చిత్రానికి కలిసొచ్చే అంశం అని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక ఈ చిత్రం యొక్క బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంకొక రెండు రోజుల్లో తెలిసిపోనుంది.