ఆకర్ష ఆకర్ష.. అంటోన్న నక్షత్ర.!

మరిన్ని వార్తలు

‘పలాస’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోన్న ముద్దుగుమ్మ నక్షత్ర. సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ బాగుంది. ఇక హీరోయిన్‌కైతే, ముందే మంచి మార్కులు పడిపోతున్నాయి. అందానికి అందం, యాక్టింగ్‌ టాలెంట్‌ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మ గతంలో ‘రాజ్‌దూత్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీహరి తనయుడు డెబ్యూ చేసిన ఈ సినిమాలోనే హీరోయిన్‌ చాలా బాగుందే అనిపించుకుంది. అయితే, ఆ సినిమా అంతగా సక్సెస్‌ కాకపోవడంతో, పాపకి అంతగా పేరు రాలేదు కానీ, ‘పలాస’ ప్రమోషన్స్‌లో నక్షత్ర స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతోంది. ప్రమోషన్స్‌లో చాలా అందంగా యాక్టివ్‌గా కనిపిస్తోంది.

 

ఒకవేళ సినిమా హిట్‌ అయితే, ఈ ముద్దుగుమ్మకి ముందు ముందు బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుందని అంటున్నారు. చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపిస్తోంది. ఇన్ని బెస్ట్‌ ఫిజికల్‌ క్వాలిటీస్‌ ఉన్న నక్షత్రకు లక్కు కూడా కలిసొస్తే, కెరీర్‌లో ఇక చూసుకోనక్కర్లేదు. రక్షిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు. మార్చి 6న రిలీజ్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS