ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ నుండి రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేశారు. ఇదివరకటి ఎనర్జీ లెవల్స్ రాజ్‌తరుణ్‌లో మళ్లీ కనిపిస్తున్నట్లున్నాయ్ ఈ సినిమాలో. ఈ మధ్య రాజ్‌తరుణ్ స్క్రీన్‌పై డల్‌గా కనిపిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో తన కెరీర్ మొదటి తరహాలో ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, టీజర్ విషయానికి వస్తే, ‘అమ్మాయిలు బాగా ముదిరిపోయార్రా..’ అంటూ హీరో డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది.
తర్వాత అబ్బాయిలు ఎలా ఉండాలో స్పైసీగా చెబుతూ హెబ్బా పటేల్ హాట్ అండ్ స్పైసీ లుక్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇక మరో హీరోయిన్ మాళవికా శర్మ, ‘మందుందా..’ అంటూ తండ్రినే అడిగే డైలాగ్.. ‘బ్రాండ్స్ లేవ్.. అని తండ్రి, ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి నాన్నా..’ అనే కూతురు.. ఇలా ఫన్నీ సన్నివేశం.. చివరిలో ‘18 ఏళ్ల కత్తిలాంటి అమ్మాయిని చూపించరా..’ అని రాజ్‌తరుణ్ అడగ్గా, కమెడియన్ మధునందన్ ఓ బికినీ బేబ్ ఫోటో చూపించి కత్తిలాంటి అమ్మాయ్ అన్నావ్ కదరా.. అంటే ‘కత్తికి బట్టలేసి చూపించరా.. ’అంటూ మరో ఫన్నీ డైలాగ్. ఆకట్టుకుంటున్నాయి. విజువల్‌గా రిచ్‌గా కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. టోటల్‌గా టీజర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అయితే సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ రాజ్‌తరుణ్ రేంజ్‌ని అందుకుంటుందా.? లేదా.? అనేది తెలియాలంటే మార్చి 25 వరకూ ఆగాల్సిందే.