ఈ ఏడాది మొదట్లో రిలీజై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం 'పలాస 1978'. నూతన దర్శకుడు కరుణ కుమార్ రూపొందించిన ఈ సినిమా శ్రీ కాకుళం ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కడం ఒక విశేషం. సినిమా భారీ విజయం సాధించకపోయినప్పటికీ దర్శకుడికి మంచి పేరు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తయారుచేసే ప్రయత్నాలలో దర్శకుడు బిజీగా ఉన్నారట. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్టు వర్కు కూడా మొదలుపెట్టారని సమాచారం అందుతోంది. ఈ సీక్వెల్ కోసం 'కాశిబుగ్గ' అనే టైటిల్ కూడా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. శ్రీకాకుళం జిల్లాలో పలాస దగ్గరలో ఉన్న ఒక గ్రామం పేరు కాశిబుగ్గ. టైటిల్ చూస్తేనే ఈ సినిమా కూడా పవర్ఫుల్ గా ఉండబోతోందని ఒక హింట్ ఇచ్చినట్లయింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.
ఇదిలా ఉంటే 'పలాస 1978' తర్వాత కరుణ కుమార్ ఆహ ప్లాట్ ఫామ్ కోసం 'మెట్రో కథలు' అనే ఒక అంథాలజి సిరీస్ కు దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత ఖదీర్ బాబు రచించిన మెట్రో కథలు పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది.