రెట్రో స్టైల్ లో ఉన్న 'పలాస 1978' పాట.

మరిన్ని వార్తలు

రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో వస్తోన్న చిత్రం ‘పలాస 1978’. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. చిత్ర కథాంశం గురించి తెలిసిన చాలామంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 

ఇక రఘు కుంచే సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ఈ పాటనుపాడటం విశేషం. బాలు ఓ ముప్ఫైయేళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడాలనుకోవడం ఎవరికైనా ఓ కల. ఆ కలను గాయనిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలోనే అందుకున్న పల్లెకోయిల బేబీ ఏకంగా ఆయనతో కలిసి డ్యూయొట్ ఆలపించేయడం నిజంగా విశేషమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS