గడుసుతనం చూపించిన మహానటి.!

మరిన్ని వార్తలు

'మహానటి' సినిమా తర్వాత కీర్తిసురేష్‌ తమిళంలో 'సామి 2' సినిమాలో నటించింది. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా రిజల్ట్‌ బెడిసికొట్టింది. ఇప్పుడు 'పందెంకోడి 2' సినిమాతో రాబోతోంది. 

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాలో కీర్తిసురేష్‌ పాత్ర కొత్తగా ఉంది. 'మహానటి'తో నటనలో పలు రకాల వేరియేషన్స్‌ చూపించిన కీర్తిసురేష్‌ 'పందెం కోడి 2'లో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా గడుసుతనం చూపిస్తోంది. ట్రైలర్‌లో కీర్తిసురేష్‌ ఎంట్రీ బాగుంది. లంగావోణీలో గడుసమ్మాయి చేష్టలతో ఆకట్టుకుంటోంది. 

ఇక సినిమా విషయానికి వస్తే, గతంలో విశాల్‌ నటించిన 'పందెం కోడి' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. పక్కా మాస్‌ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ట్రైలర్‌లో యాక్షన్‌ ఘట్టాలను బాగా కట్‌ చేశారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విలన్‌ పాత్రలో నటిస్తోంది. ఆమె అప్పియరెన్స్‌ని ట్రైలర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. 'పందెంకోడి'లో మీరా జాస్మిన్ ఈ పాత్రను పోషించింది. విశాల్‌ కెరీర్‌ని టర్న్‌ చేసిన 'పందెంకోడి'కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా మరోసారి విశాల్‌ కెరీర్‌లో బెస్ట్‌ హిట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. 

దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS