'బీటెక్ చేసి పేపర్ వేస్తున్నావా? అని హీరోయిన్ అడిగితే, అది బతకడం కోసం ఇది భవిష్యత్ కోసం..' అంటున్నాడు హీరో. సంపత్ నంది నిర్మాణంలో రూపొందుతోన్న 'పేపర్‌బోయ్' సినిమాలోనిదీ డైలాగ్. జయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
మాస్ మసాలా మూవీస్‌కి పెట్టింది పేరు సంపత్ నంది. అలాంటి డైరెక్టర్ చిన్న చిత్రాలను నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. గతంలో 'గాలిపటం' చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా 'పేపర్‌బోయ్' చిత్రానికి నిర్మాణ బాథ్యతతో పాటు, స్టోరీ కూడా తానే అందించాడు సంపత్‌నంది. బీటెక్ చేసిన ఓ కుర్రాడు పేపర్ బోయ్‌గా మారాడు. తన లవ్‌నీ, లవర్‌నీ పరిచయం చేస్తూ టీజర్ మొదలైంది. టీజర్ చివర్లో బతకడానికీ, భవిష్యత్‌కీ అంటూ డైలాగ్ చెప్పి, హార్ట్‌ని ఎక్కడో టచ్ చేశాడు. యూత్‌కి కూడా బానే కనెక్ట్ అవుతాడీ డైలాగ్‌తో అనిపిస్తోంది.
ఒకవేళ ఏమాత్రం యూత్‌కి కనెక్ట్ అయినా సినిమా పెద్ద హిట్ అయిపోవడం పక్కా. ఇప్పుడు డైరెక్టర్స్ ఫోకస్ కూడా యూత్ మీదే. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆర్ ఎక్స్ 100' ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పేపర్ బోయ్‌కి కూడా అలాంటి కళ ఉందేమో చూడాలి మరి. టీజర్ చూస్తే క్లీన్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. అయినా రిజల్ట్ మాత్రం అస్సలు అంచనా వేయలేమండోయ్.