ఆ హాలీవుడ్‌ రీమేక్‌లో ఈ బాలీవుడ్‌ భామ!

By Inkmantra - September 24, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

'ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌' అనే హాలీవుడ్‌ సినిమాని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ముద్దుగుమ్మ పరిణీతా చోప్రా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. విడాకులు తీసుకున్న ఓ మహిళ మధ్యానికి బానిసై ప్రతీ రోజూ ట్రైన్‌లో తిరుగుతుంటుంది. ఎందుకు.. అంటే నో రీజన్‌. రీజన్‌ లెస్‌గా, ఎయిమ్‌ లెస్‌గా తిరుగుతున్న ఆ మహిళకు ఒక రోజు ఆ ట్రైన్‌లో వింత అనుభవం ఎదురవుతుంది. ఊహించని ఆ పరిణామంతో ఆ మహిళ జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి.

 

ఆ తర్వాత ఆమె ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అనేదే కథ. థ్రిల్లర్‌ టచ్‌తో ఈ సినిమాని రూపొందించారు. లేటెస్ట్‌గా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆశక్తి కలిగించేలా ఉంది. ముఖం నిండా గాయాలతో బాత్‌ టబ్‌లో కూర్చొని టెన్షన్‌గా కనిపిస్తున్న పరిణీతి చోప్రా లుక్‌ చూస్తుంటే, ఈ మూవీతో సమ్‌థింగ్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసేలానే ఉంది పరిణీతి చోప్రా. నిజానికి పరిణీతి చోప్రా సౌత్‌ ఎంట్రీకి చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, అందుకు సరైన వేదిక సిద్ధం కావడం లేదు. కానీ, ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో బిజీగానే గడుపుతోంది. ఈ తాజా చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS