రాహుల్ సిప్లిగంజ్ 'బిగ్' అజ్ఞాతం వీడాడు. రెట్టించిన ఉత్సాహంతో హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కన్‌ఫేషన్ రూమ్ నుండి హారర్ టోన్‌తో సౌండ్స్ చేస్తూ, హౌస్ మేట్స్‌ని పలకరించి షాక్ ఇచ్చాడు. రాహుల్ రాకతో హౌస్‌లో కొంత మేర నవ్వులు పూశాయి. ముఖ్యంగా పునర్నవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
రాహుల్ ఎంట్రీ ఇచ్చే సమయానికి పునర్నవి కరెక్ట్‌గా రాహుల్‌ని తలచుకుంటుండడం, ఆ మనిషి ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో.. అంటూ రాహుల్ ఊహల్లో తేలుతున్న సమయంలోనే ఊహించని విధంగా రాహుల్ ఎంట్రీ ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మాటల్లో చెప్పలేని ఎగ్జైట్‌మెంట్‌ని ఆమె ముఖంలో చూశారు ఆడియన్స్. రాహుల్ వెళ్లిపోవడంతో జెన్యూన్‌గా ఫీలయ్యింది ఇద్దరే ఇద్దరు. వారే పునర్నవి, వరుణ్. ఆ ఇద్దరూ రాహుల్ రాకతో హ్యాపీ ఫీలయ్యారు.
తర్వాత వితిక, మహేష్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ, శ్రీముఖి, బాబా భాస్కర్, రవి, శివజ్యోతి ముఖాల్లో రక్తపు చుక్కల్లేకుండా పోయాయి. రాహుల్ రాకను వారు ఇష్టపడినట్లుగా లేదు. ఆ హావభావాల్ని అచ్చంగా ముఖాల్లో ప్రతిబింబించేశారు. రాహుల్ సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు మీరు ఏమేం మాట్లాడుకున్నారో అంతా నాకు కనిపించింది.. అని వారి సంభాషణల సారాంశాన్ని కొన్ని డైలాగుల్ని రాహుల్ చెప్పడంతో, శ్రీముఖి గ్యాంగ్‌లో అలజడి మొదలైంది. అన్‌ఎక్స్‌పెక్ట్‌డ్‌గా జరిగిన ఈ రీ ఎంట్రీతో వారు షాక్ అయ్యారు.