డైరెక్టర్ వెంకట ప్రభు తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు తెరకెక్కించారు. ఆయన తెరకెక్కించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ రిలీజై, మంచి ఆదరణ పొందాయి. గతంలో 'సరోజ' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఈయనే. తాజాగా ఈయన తమిళంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే 'పార్టీ' చిత్రం.
ఇదో థ్రిల్లర్ మూవీ. తెలుగు, తమిళ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వారిలో రమ్యకృష్ణ, రెజీనా, నివేతా పేతురాజ్, సంచిత, నాజర్, జై తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు సినిమాల్లో పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ పాత్రనూ ఎంతో జాగ్రత్తగా చిత్రీకరిస్తారాయన. అలా ఆయన సినిమాలో ప్రతీ పాత్ర లీడ్ రోల్‌నే పోషిస్తుంది. అదే ఆయన సినిమాల్లో స్పెషాలిటీ. అలాగే ఈ 'పార్టీ' చిత్రం కూడా తెరకెక్కుతోంది. రాత్రికి రాత్రే కొందరి జీవితాలు ఎలా మారిపోయాయనేదే కాన్సెప్ట్.
పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఎలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. ప్రాక్టికల్‌గా ఈ పరిస్థితుల్ని అందరం అనుభవించాం. ఈ పాయింట్‌ని పట్టుకుని ఈ చిత్రానికి స్టోరీ రాసుకున్నారు. ఆ స్టోరీని అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందరి దృష్టినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ తరహాలో తెలుగులోనూ ఈ మధ్య కొన్ని చిత్రాలు వచ్చాయి. వాటిలో మినీ మల్టీ స్టారర్‌గా వచ్చిన 'శ్యమంతకమణి' చిత్రం ఒకటి. ఓ నైట్ పార్టీ కొందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసింది.. ఆ క్లిష్ట పరిస్థితిని వారు ఎలా ఎదుర్కొన్నారనే కాన్సెప్ట్‌ని థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్. అలాంటి కాన్సెప్ట్‌నే మరింత థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించనున్నారట వెంకట్ ప్రభు.
టీజర్ అయితే చాలా చాలా ఆశక్తికరంగా ఉంది. సినిమా ఎలా ఉండబోతోందో చూడాలంటే మరి కొంత సమయం ఆగాల్సిందే!