అనుష్కకి విరాట్ ఇచ్చిన ‘రింగ్’ ఖరీదు ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు

అనుష్క-విరాట్ జంట విరుష్క గా మారిన సందర్భంలో వారి వివాహ వేడుకకి సంబందించిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఆ వివాహ వేడుకలో అనుష్క కి విరాట్ తొడిగిన వివాహ ఉంగరం ఖరీదు తెలుసుకుంటే షాక్ కి గురవ్వాల్సిందే. ఎందుకంటే దాని ఖరీదు అక్షరాల 1 కోటి రూపాయలు అని తెలుస్తున్నది. దాని ఖరీదు అంత ఎందుకంటే, అది చాలా అరుదుగా లభించే వజ్రంతో చేసినది కావడమే, అది ఆస్ట్రియా దేశంలో ప్రత్యేకంగా విరాట్ తయారు చేయించాడు. ఈ విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరు షాక్ కి గురవుతున్నారు. ఎందుకంటే అంత ఖరీదు గల ఉంగరం ఇచ్చాడు అంటే అనుష్క శర్మ ఎంత ప్రేమనో ఇట్టే తెలిసిపోతుంది.

ఇక వారు వివాహం చేసుకున్న రిసార్ట్ లో వారు ఈ వారం మొత్తం ఉన్నందుకు సుమారు రూ 1 కోటి వరకు అవుతుందని ఒక ప్రాధమిక అంచనా..

దీన్నిబట్టి చూస్తే విరాట్-అనుష్క అలియాస్ విరుష్క పెళ్ళి ఖర్చు కోట్లలోకి వెళ్ళిపోయింది అని అర్ధమవుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS