పాపం.. ఆ రెండు కోట్లూ ఇవ్వ‌లేద‌ట‌

మరిన్ని వార్తలు

గీత గోవిందంతో సూప‌ర్ హిట్ కొట్టి చిత్ర‌సీమ‌ని తన వైపు చూసేలా చేసుకొన్నాడు ప‌ర‌శురామ్‌. ఆ వెంట‌నే మ‌హేష్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. గీత గోవిందం కి ముందు ప‌ర‌శురామ్ పారితోషికం 2 కోట్లే. కానీ గీత గోవిందానికి దాదాపు 10 కోట్లు అందుకొన్నాడ‌ని టాక్‌. మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`కి అంత‌కంటే ఎక్కువ పారితోషికం ఆశిస్తారు. కానీ ప‌ర‌శురామ్ కి ద‌క్కింది తక్కువే.

 

ఈ సినిమాకి రూ.`10 కోట్ల పారితోషికం ఇస్తామ‌ని ముందు నిర్మాత‌లు ఎగ్రిమెంట్ చేశార్ట‌. కానీ...రూ.8 మాత్ర‌మే ఇచ్చారు. సినిమా హిట్ట‌యితే మ‌రో రూ2 కోట్లు ఇస్తామ‌ని చెప్పార్ట‌. సినిమా హిట్ట‌ని నిర్మాత‌లు డంకా బ‌నాయించి చెబుతున్నారు. కానీ ఆ రెండు కోట్లూ ఇంకా రాలేద‌ని స‌మాచారం. బ‌డ్జెట్ హెవీగా పెరిగిపోయిందని, అందుకే సినిమా హిట్ట‌యినా లాభాలు రాలేద‌ని, కాబ‌ట్టే.. 2 కోట్ల పారితోషికం వెన‌క్కి ఇవ్వ‌డం లేద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. అలా... సినిమా హిట్ట‌యినా రూ.2 కోట్లు పోగొట్టుకొన్నాడు ప‌ర‌శురామ్. తాజాగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో ప‌ర‌శురామ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి తాను అందుకొంటున్న పారితోషికం రూ.5 కోట్లేన‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS