అర్జున్ రెడ్డిని వదులుకుని చాలా బాధపడుతుంది..!

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోవటం కూడా జరిగిపోయింది. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులకి కూడా ఈ సినిమా విడుదలవ్వడంతోనే అవకాశాలు వెల్లువెత్తాయి.

అయితే ఈ చిత్రం పట్ల ఒక హీరోయిన్ మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఎందుకంటే- ఆ హీరోయిన్ ఈ చిత్రంలో నటించలేక పోయిందట. దానికి కారణం ఆమె ఈ కథ వినప్పుడు ముద్దు సన్నివేశాలు ఉన్నాయని తెలియడంతో ఆమె ఈ సినిమాని వదులుకుందట.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా- పేరు పార్వతి నాయర్. ఇక ఆమె ఈ చిత్రం విడుదలయ్యాక సినిమాకి, హీరోయిన్ పాత్రకి వచ్చిన గుర్తింపుతో ఆమె చేసిన తప్పుకి లోలోపల మరింతగా బాధపడిపోతున్నదట.

ఏదేమైనప్పటికీ అర్జున్ రెడ్డి చిత్రం ఎక్కువ మందికి ఆనందాన్నిస్తే, ఈ నటికి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS