నరేష్-పవిత్రల అనుబంధం అందరికీ తెలిసిందే. తాజాగా తాము పెళ్లి చేసుకున్నామని వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఆ వీడియోపై పూర్తి వివరాలు త్వరలో మాట్లాడతానని చెప్పుకొచ్చారు నరేష్. ఇలాంటి నేపధ్యంలో పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పవిత్ర లోకేష్ ఒక అవకాశవాదని, విజయనిర్మల సంపాదించిన ఆస్థి మొత్తం దాదాపు 1500 కోట్లు కాజేసుకుందని ఆరోపించాడు. అంతేకాదు నరేష్-పవిత్రాలు బాగా జల్సాలు చేస్తూ విజయనిర్మలమ్మ సంపాదించిన కష్టార్జితాన్ని ఆవిరి చేస్తున్నారని , పవిత్రకు లగ్జరీగా జీవించడం ఇష్టమని ఆమెకు డబ్బే సర్వస్వం, నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నరేష్ కు దగ్గరైయింది. అతని దగ్గర డబ్బులు అయిపోతే ఇంకొకరిని చూసుకుంటుందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
సుచేంద్ర ప్రసాద్ సినిమా, టెలివిజన్ నటుడు రచయిత, దర్శకుడు. పవిత్ర లోకేష్ ని 2007లో రెండో వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఒకే పరిశ్రమలో పనిచేస్తున్న కారణంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్యనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే సుచేంద్ర మాటలు విన్నవారంతా పవిత్ర కారెక్టర్ అంత బ్యాడా ? అని మాట్లడుకుంటున్నారు. ఏదేమైనా ఇది ఆరోపణ మాత్రమే.