‘’నా బిడ్డకు మూడేళ్ళు ఉన్నపుడు సంగీతం నేర్పించా. తన ప్రతిభ చూసి ప్రతి క్షణం ఆశ్చర్యపొతుంటాను. వాడి కడుపునిండా సంగీతమే. సంగీతమే నా కొడుకుగా పుట్టాడు’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆస్కార్ విజేత కీరవాణి తండ్రి శివశక్తి దత్త.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీరవాణి స్వరపరిచిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీరవాణి తండ్రి రచయిత, కవి శివశక్తి దత్త తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు. ‘’కీరవాణి సాధిస్తున్న విజయాలు చూసి తండ్రిగానే కాదు ఒక భారతీయుడిగా తెలుగువాడిగా గర్వపడుతున్నా. ఈ ప్రయాణంలో ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.