నరేష్ - పవిత్రా లోకేష్‌ల వ్యవహారం తెలియంది కాదు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న విషయం.. మీడియా కోడై కూస్తోంది. దానికి తోడు.. నరేష్ మూడో భార్య రమ్య కూడా వీరిద్దరిపై పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. ఓ హోటెల్ నరేష్ - పవిత్ర కలిసి ఉన్నప్పుడు మీడియానీ, పోలీసులనూ వెంట పెట్టుకొని వెళ్లి, రచ్చ రచ్చ చేసింది. అప్పటి నుంచీ.. నరేష్ - పవిత్రా లోకేష్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కడికెళ్లినా ఇద్దరూ జంటగానే వెళ్తున్నారు.
ఇప్పుడు పవత్రా లోకేష్ మళ్లీ వార్తల్లోకి నిలిచింది. రమ్యపై ఆమె రివర్స్ అయ్యింది. కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ల వెనుక రమ్య హస్తం ఉందని, వాటిని అడ్డు పెట్టుకొని రమ్య తన పరువు తీస్తోందని ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు కలగ చేసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లనూ, వెబ్ సైట్లనీ గుర్తించి.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆమె పోలీస్ స్టేషన్‌లోనూ కేస్ ఫైల్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి నిన్నా మొన్నటి వరకూ.... పవిత్ర లోకేష్‌ని రమ్య వెంటాడింది. ఇప్పుడు రమ్య వెనుక పవిత్ర పడుతోంది. మొత్తానికి ఈ రచ్చ మళ్లీ మొదలైనట్టైంది.