ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతందా? అని ఆయన అభిమానులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనేఉన్నారు. పెళ్లి సంగతేమో గానీ, ప్రభాస్ పై ప్రేమ కబుర్లకు ఢోకా లేకుండా పోయింది. అనుష్కతో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడని చాలాకాలంగా ఓ వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. ప్రభాస్ - అనుష్క పెళ్లి కూడా చేసుకొంటారని చెప్పుకొన్నారు. కానీ.. అదేం జరగలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ గురించిన మరో లవ్ స్టోరీ వార్తల్లో ఉంది. ప్రభాస్ `ఆదిపురుష్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కృతి సనన్ కథానాయిక. బాలీవుడ్ లో వీరిద్దరి కెమిస్ట్రీ గురించీ రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, అక్కడి మీడియా టామ్ టామ్ చేస్తోంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సైతం.. వీరిద్దరి లవ్ స్టోరీ గురించి హింట్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో `కృతి మనసులో ఒకరున్నారు. వాళ్లు ముంబైకి చెందిన వాళ్లు కాదు.. ప్రస్తుతం అతను దీపికా పదుకొణెతో ఓ సినిమా చేస్తున్నాడు` అంటూ క్లూలు ఇచ్చేశాడు. దాంతో కృతి మనసులో ఉన్నది ప్రభాసే అని ఫ్యాన్స్ కూడా ఫిక్సయిపోయారు. `ప్రాజెక్ట్ కె` కోసం ప్రభాస్ - దీపిక పదుకొణె జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొనే వరుణ్ ధావన్ ఈ క్లూ ఇచ్చాడని టాక్. బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నా.. ప్రభాస్ పై అభిమానులకు అంతో ఇంతో నమ్మకం ఉండేది. ఇప్పుడు స్వయంగా వరుణ్ ధావన్ ఇలా క్లూ ఇచ్చేడంతో.. ఈ లవ్ మేటర్ నిజమే అని ఫిక్సయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.