ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హైదరాబాద్ కార్యాలయంపై జనసేన కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం 'పవర్‌స్టార్'పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వర్మ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. సమయానికి రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 'పవర్‌స్టార్' చిత్రానికి సంబంధించిన 'గడ్డి తింటావా' అనే వీడియో గీతాన్ని వర్మ ఇటీవలే విడుదల చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ను కించపరిచేలా చూపించారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వర్మ ఆఫీసుపై దాడికి జరగడం చర్చనీయాంశమైంది. అయితే ఈ దాడిపై రామ్‌గోపాల్‌వర్మ తనదైన వ్యంగ్యాత్మక ధోరణిలో స్పందించారు. 'జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు పవన్ అభిమానులు నా ఆఫీసుపై దాడి చేశారు. వారిని నా బాడీగార్డ్స్‌తో పాటు పోలీసులు బయటకు గెంటేశారు. దాడి చేసిన వారికి నా ముద్దుల్ని అందజేస్తున్నా. నా పవర్‌స్టార్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ కల్పించారు' వారు అంటూ సైటైర్లు విసిరారు.