ఆర్జీవిపై తెరకెక్కుతున్న సినిమా `పరాన్నజీవి`. నూతన్ నాయుడు ఈ సినిమాకి దర్శకుడు. పవన్ కల్యాణ్‌పై వర్మ తీస్తున్న `పవర్ స్టార్` ఎంత ట్రెండింగ్ అవుతోందో. వర్మపై తీస్తున్న `పరాన్నజీవి`పైనా అంతే అటెన్షన్ మొదలైంది. పవన్ అభిమానులు, వర్మ భక్తులు ఈ సినిమాపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై వర్మ కూడా స్పందించాడు.
సృష్టిలో ప్రతి ఒక్కరూ పరాన్నజీవులే అని, ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆధారపడి జీవించేవాళ్లేనని, తననిపరాన్న జీవి అని పిలచుకోవడంలో తప్పు లేదని తనదైన శైలిలో కౌంటర్ వేశాడు. ఎవరు ఎవరిపైనైనా సినిమా తీసుకోవొచ్చని, అది వాళ్ల హక్కు అని, తనపై ఎవరు, ఎలాంటి సినిమా తీసుకున్నా, తనని ఎలా చూపించినా తనకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమాని వర్మ లైట్ తీసుకున్నట్టే అనిపిస్తోంది. మరి విడుదలైన తరవాత.. ఏమైనా వైల్డ్‌గా స్పందిస్తాడేమో చూడాలి.