ఓ స్టార్ హీరో సినిమా అంటే ఎంత హంగామా ఉండాలి? హీరోయిన్లను సైతం ఆ స్టార్ హీరోకి తగ్గట్టుగానే తీసుకురావాలి. అయితే.. పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ఇదేం జరగడం లేదు. పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `విరూపాక్ష` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో ఇద్దరు కథానాయికలుంటారు. ఓ నాయికగా జాక్వెలెన్ ఫెర్నాండేజ్‌ని ఎంచుకున్నారు. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకున్నారని టాక్ నడుస్తోంది.
పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను ఓ స్టార్... పవర్ స్టార్. అలాంటి హీరో పక్కన ఏమాత్రం క్రేజ్ లేని కథానాయికల్ని ఎంచుకుంటున్నాడు క్రిష్. అటు జాక్వెలెన్ గానీ, ఇటు నిధి అగర్వాల్ గానీ, పవన్ పక్కన సరితూగరన్నది పవన్ అభిమానుల భయం. నిధి అయితే `సవ్యసాచి`, `మిస్టర్ మజ్ను` సినిమాలతో ఫ్లాపులు అందుకుంది. `ఇస్మార్ట్ శంకర్` హిట్టయినా, అందులో క్రెడిట్ మిగిలిన వాళ్లకు వెళ్లింది గానీ, నిధికి కాదు. పైగా... తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా వీక్ గా ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా నిధిని ఎలా ఎంచుకుంటారబ్బా..? అని పవన్ అభిమానులు క్రిష్ పై గుర్రుగా ఉన్నారు. కాస్టింగ్ విషయంలో క్రిష్ ఇంత అశ్రద్ధ ఎందుకు చేస్తున్నాడో ఏమో..?