వెంకీ ఓకే... త‌రుణ్ హ్యాపీ!

మరిన్ని వార్తలు

`ఈ న‌గ‌రానికి ఏమైంది` త‌ర‌వాత‌... త‌రుణ్ భాస్కర్ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు. ఈలోగా త‌ను న‌టుడిగా బిజీ అవుతూ వ‌చ్చాడు. కొన్ని టాక్ షోలూ.. చేశాడు. ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ త‌ను మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తుంద‌ని చాలా రోజుల నుంచీ ప్ర‌చారం జరుగుతోంది. వెంకీకి త‌రుణ్ ఓ క‌థ చెప్ప‌డం, దానిపై డిస్క‌ర్ష‌న్ న‌డ‌వ‌డం జ‌రిగాయి.

 

అయితే ఎందుకో ఆ క‌థ వెంకీకి ఎక్కలేదు. దాంతో ఆ క‌థ‌ని త‌రుణ్ పూర్తిగా పక్క‌న పెట్టేసి, మ‌రో క‌థ రెడీ చేశాడ‌ట‌. ఇప్పుడు ఈ క‌థ ఇటు వెంకీకీ, అటు సురేష్ బాబుకీ బాగా న‌చ్చాయ‌ని స‌మాచారం. ఇద్ద‌రూ ఈ క‌థ‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఈ సినిమా చేసేందుకు వీలు కాక‌పోవొచ్చు. ఎందుకంటే... వెంకీ చేతిలో ఉన్న `నార‌ప్ప‌` ముందుగా పూర్తికావ‌ల్సివుంది. ఆ త‌ర‌వాత‌.. `ఎఫ్ 3` ప‌ట్టాలెక్కుతుంది. వీటి త‌ర‌వాతే... త‌రుణ్ సినిమా ఉండొచ్చు. మొత్తానికి వెంకీతో సినిమా చేయాల‌న్న కోరిక‌.. త‌రుణ్‌కి ఈ విధంగా తీరబోతోంది. చూద్దాం.. ముహూర్తం ఎప్పుడు నిర్ణ‌యిస్తారో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS