శివరాత్రికి హరి హర వీరమల్లు

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్స్ ఏవి రాలేదని అప్సెట్ గా ఉన్న మెగా ఫాన్స్ కి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పవన్ హీరోగా జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  హరిహర వీరమల్లు గత కొంత కాలంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించి, సినిమాలను పూర్తిగా ఆపేశారని,  ఎన్నికల తరవాత కూడా OG, ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసి, అప్పుడు హారి హర వీర మల్లుకి టైం కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి.  హరిహర వీరమల్లు గూర్చి అస్సలు ఎలాంటి ఇంటిమేషన్ లేదని, ఈ మూవీ షూటింగ్ అవుతుందా లేదా, అని రక రకాల సందేహాల్లో ఉండగా రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాత ఏ.ఎం రత్నం  వీరమల్లు అదిరిపోయే విజువల్  ట్రీట్ ఇవ్వనుంది అని,  ఈ ఇయర్ చివర్లోనే సినిమా పూర్తి చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.


తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ ప్రోమో వీడియోని మహా శివరాత్రి కానుకగా మార్చి 8న మేకర్స్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రోమోలోనే రిలీజ్ డేట్ పై కూడా  క్లారిటీ ఉంటుందని సమాచారం. ఇటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ప్రోమోలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టినట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హరిహర వీరమల్లు చిత్రంలో యోధుడిగా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. తొడ గొట్టాలే తెలుగోడు అంటూ రెండేళ్ల కిందట వచ్చిన పవర్ గ్లాన్స్ అదిరిపోయింది. మొఘలుల నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది.


హరిహర వీరమల్లు చిత్రంలో యానిమల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‍గా చేస్తున్నారు. విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి, జిస్సు సెంగుప్త, పూజిత పొన్నాడ కీరోల్స్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS