పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే ఈ కృతజ్ఞతలకి కారణం తన సినిమాలు ఆదరిస్తున్నందుకు కాదు, తన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు. ఈ జన సైనికుల శిబిరాలను విజయవంతం చేసిన జనసేన కార్యకర్తలకి మరీ మరీ తన కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎంపిక కార్యక్రమాలని జనసేన వెబ్ సైట్ ద్వారా చేపట్టనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పవన్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తాను అంటూ ప్రకటించిన నేపధ్యంలో అభిమానులు కూడా తమ హీరో వెనుక నిలబడే ప్రయత్నంలో ఉన్నారు.