పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ని దాదాపుగా ఖరారు అయిపోయినట్లే అనే ప్రచారం తప్ప అఫీషియల్ క్లారిటీ రాలేదు. అయితే ఈ నెల 25న టైటిల్‌ని అషీషియల్‌గా ఖరారు చేయనుందట చిత్ర యూనిట్. యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం వారణాసికి బయలుదేరింది.
ఈ షెడ్యూల్ కంప్లీట్ అయితే సినిమా షూటింగ్ పూర్తయినట్లే. 2018 జనవరి 10న సినిమాని విడుదల చేస్తారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌కున్న క్రేజ్ అలాంటిది. ఈ సినిమాకి ప్రీరిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతోందట. ఆ స్థాయి ఎంత అంటే, దేశం గర్వించదగ్గ సినిమా అయిన 'బాహుబలి'ని మించి బిజినెస్ జరుగుతోందని సమాచారమ్. పవన్ - త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ పరంగానే ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్నాడు. సో ఓవర్సీస్‌లో ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడింది. అసలే ఓవర్సీస్‌లో పవన్ మార్కెట్‌కి తిరుగే లేదు. అలాంటిది ఈ కాంబో అంటే మరీ అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాదు, స్టోరీ పరంగా కూడా సినిమాపై అక్కడ భారీగా అంచనాలున్నాయి. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారణాశిలో అతి కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక్కడ తెరకెక్కించే సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయట. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. 'బైటికొచ్చి చూస్తే.. ' సాంగ్ ఇప్పటికే ఓ ఊపు ఊపేస్తోంది. ఇక మిగిలిన సాంగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయట. మరో పక్క ఈ సినిమాలో 'కాటమరాయుడా..' సాంగ్ మాదిరి ఓ సాంగ్‌ని పవన్ చేత పాడించారంటూ ప్రచారం జరుగుతోంది.