పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ట్రైలర్ నిన్న అర్దరాత్రి విడుదలైంది. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల అవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేవు అని చెప్పొచ్చు.
ఇక వారి ఆనందాన్ని రెట్టింపు చేసే మరొక విషయం భయటకి వచ్చింది. అదేమనగా- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు థియేటర్ల లో విడుదలకి ముందురోజు అయిన జనవరి 10వ తేది రాత్రి 1 గంట నుండి ఉదయం 10గంటల వరకు అజ్ఞాతవాసి సినిమా ప్రదర్శనకి అనుమతులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది.
దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబురాలు 10వ తేదీ అర్దరాత్రి నుండే మొదలవనున్నాయి. ఇక ఇదే అంశం పైన నిన్న త్రివిక్రమ్-చినబాబులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి అనుమతి కోరినట్టు సమాచారం. మరి దీని పైన తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తుంది అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రంతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అయ్యాడు.