ఊపిరితిత్తులు సమస్యతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావుకి పరామర్శల వెల్లువ కొనసాగుతుంది.
ఇప్పటికే మోహన్ బాబు, అల్లు అరవింద్ అలాగే రాజకీయ నాయకుడు వై ఎస్ జగన్ కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని దాసరి యోగక్షేమాలు వారి కుటుంబ సబ్యులని అడిగి తెలుసుకున్నారు.
ఇదిలాఉంటే డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దాసరి ఆరోగ్యం నిన్నటి మీద మెరుగు అవుతుందని వెల్లడించారు. ఊపిరితిత్తులకు ఏర్పాటు చేసిన వెంటిలేటర్ కూడా తొలిగించడం వల్ల దాసరి ఆరోగ్య పరిస్థితిలో చాలా వరకు మెరుగు అయినట్టు అని సమాచారం.
ఇంకొక రెండు మూడు రోజుల్లో దర్శకరత్న ఆరోగ్యం పై స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.