అన్నయ్యకి తమ్ముడి పుట్టినరోజు శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా ఈరోజు తన అన్నయ్య చిరంజీవిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి.  

చాలారోజుల తరువాత ఈ మెగా బ్రదర్స్ ఇద్దరు ఇలా కలవడం పట్ల మెగా అభిమానులందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈరోజు మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందనే చెప్పాలి.

యంగ్ హీరోల నుండి మొదలుకుని నిర్మాతలు, దర్శకులు, నటులు ఇలా అనేకమంది ఆయనకి విషెస్ తెలిపేందుకు మెగా ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ సంవత్సరం పుట్టినరోజు పురస్కరించుకుని నిన్న విడుదలైన సైరా టీజర్ కి విశేషమైన స్పందన రావడంతో ఆయనకి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది గుర్తుండిపోతుంది అని చెప్పొచ్చు.

ఏదేమైనా ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ & పవర్ స్టార్ ఉండడం అదుర్స్ అనిపిస్తుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS