పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తొలుత ఆయన నెగిటివ్‌గా రిజల్ట్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు తన ఫామ్ హోస్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. నిన్న జ్వరం, ఒళ్లునొప్పులు రావడంతో.. ఈరోజు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈసారి పాజిటివ్ అని తేలింది. దాంతో.. ఆయనకు వైద్యులు చికిత్స మొదలెట్టారు. ఖమ్మంకు చెందిన కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ ఆధ్వర్యంలో పవన్ కి చికిత్స ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. పవన్ కోసమే... అపోలో నుంచి ఓ ప్రత్యేకమైన వైద్యబృందం వచ్చింది. వాళ్లు కూడా అవసరమైన సలహాలూ సూచనలూ అందిస్తున్నారు.