షాకింగ్‌ న్యూస్‌: ఎలక్షన్స్‌లో పవన్‌ ఖర్చు చేసినదెంతో తెలుసా?

మరిన్ని వార్తలు

ఎలక్షన్స్‌లో ఖర్చు చేసే మ్యాగ్జిమమ్‌ మొత్తం 28 లక్షల ఫిగర్‌గా అఫీషియల్‌గా లెక్కిస్తారు. అయితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలక్షన్స్‌ నిమిత్తం ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా? కేవలం 8 లక్షలే. మిగిలిన పార్టీలు మ్యాగ్జిమమ్‌ అమౌంట్‌ని మించి ఖర్చు చేశారు. కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు 50 కోట్లు వరకూ ఖర్చు చేశారంటూ ప్రత్యక్షంగా ఓ టీడీపీ నేత స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. అలాంటిది జనసేన మాత్రం 8 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది.

 

రాజకీయాల్లో మార్పు కోసమే ఉద్భవించిన జనసేన పార్టీ ఇక్కడితోనే ఆ మార్పు మొదలు పెట్టింది. వాస్తవానికి పవన్‌ కళ్యాణ్‌ అనుకుంటే, ఎంత మొత్తమైనా ఖర్చు చేయగలడు. పవన్‌ని పక్కన పెడితే, ఆయన ఫ్యాన్స్‌ తలచుకుంటే, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఊహించని సొమ్ములు ఖర్చు చేసే అవకాశమూ ఉంది. కానీ అలా జరగలేదు. మే 23న రాబోయే ఎన్నికల ఫలితాలలో పవన్‌ కళ్యాణ్‌ గెలుపు సాధ్యమా.? కాదా.? అనే సంగతి పక్కన పెడితే, పవన్‌ కోరుకున్న మార్పు అయితే మొదలయ్యిందని చెప్పాలి.

 

ఈ విషయం తెలిశాక పవన్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు చాలా మంది. ప్రజారాజ్యం పార్టీ టైంలో చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. ఆలాంటి ఆరోపణలకు 'జనసేన' అవకాశమివ్వలేదు. గెలపోటములు సర్వసాధారణం. కానీ కావాల్సింది ఈ మార్పే. జనం కోరుకుంటోంది ఈ మార్పునే. ఈ మార్పు విషయంలో పవన్‌ కళ్యాణ్‌ సక్సెస్‌ అయినట్లే. ఇక గెలుపు, ఓటమితో ఆయనకు అస్సలు సంబంధమే లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS