రేణు దేశాయ్ నిశ్చితార్థం, పవన్ ఫ్యాన్స్ స్పందన

మరిన్ని వార్తలు

రేణు దేశాయ్ కి నిశ్చితార్థం జరిగింది, దీనికి సంబంధించి ఆమె ఒక ఫోటో ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. దీనితో ఆమె గత కొన్నిరోజులుగా రెండవ పెళ్ళికి సంబంధించి మాట్లాడుతున్న దానికి ఒక తెరపడింది. 

అయితే రేణు దేశాయ్ ని పెళ్ళి చేసుకోబోయే వరుడు ఎవరు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఫోటోలో కూడా అతగాడి ముఖం కనపడట్లేదు. ఇవ్వన్ని పక్కన పెడితే, రేణు దేశాయ్ తన రెండవ పెళ్ళి టాపిక్ తెచ్చినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి ఆమెకి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూనే ఉంది. 

ఆ వ్యతిరేకతకి రేణు వైపు నుండి కూడా అదే స్థాయిలో కౌంటర్లు కూడా ఉంటున్నాయి. ఇక తాజాగా రేణు నిశ్చితార్ధం అయిపొయింది అని తెలిసాక పవన్ ఫ్యాన్స్ లో కొందరు ఆమెకి వ్యతిరేకంగా మరికొంతమంది అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.

అయితే ఇంతకముందు కనిపించినంత వ్యతిరేకత అయితే ఏమి లేదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మిశ్రమ స్థాయి స్పందన వచ్చింది అని చెప్పొచ్చు. ఏదేమైనా.. రేణు దేశాయ్ కోరుకున్నట్టుగానే తన జీవితంలో ఒక తోడు దొరికాడు, ఈ సందర్భంగా ఆమెకి బెస్ట్ విషెస్...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS