పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయన ఇక సినిమాలకి స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులకి నిరాశ చెందారు. అయితే ఈ నిర్ణయం ఒక హీరోకి వరంలా మారింది.
ఆ హీరో ఎవరంటే- నాని. పూర్తి వివరాల్లోకి వెళితే- మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆ చిత్రం ఆగిపోయింది.
ప్రస్తుతం అదే కథని హీరో నానికి వినిపించాడట దర్శకుడు. ఆ కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్టు సమాచారం. దీనితో పవన్ కళ్యాణ్ ఖాతాలో పడాల్సిన చిత్రం నాని ఖాతాలో పడబోతున్నది.
దీనితో పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం నానికి బాగా పనికొచ్చింది.