అతిలోకసుందరి శ్రీదేవి మరణం సినిమా అభిమానులందరినీ ఎంతగానో కలిచివేసింది. అయితే ఆమె ఆకస్మిక మృతికి కారణం గుండెపోటు అని తేలింది.
అయితే ఆమె చనిపోయే కొన్ని గంటల ముందు భర్త బోనీ కపూర్ నుండి ఆమె ఒక షాకింగ్ సర్ప్రైజ్ ని అందుకున్నారు. అదేంటంటే- తమ కుటుంబంలో పెళ్ళి వేడుక కోసం గతవారం శ్రీదేవి చిన్న కూతురు ఖుషితో కలిసి దుబాయ్ వెళ్ళాడు బోనీ కపూర్. కాని ఒక ముఖ్యమైన పని ఉండడంతో ఆయన పెళ్ళి ముగియగానే ముంబై వచ్చేశాడు ఆ తరువాత శ్రీదేవి కి సర్ప్రైజ్ ఇద్దామని ఆమెకి చెప్పకుండానే శనివారం సాయంత్రం దుబాయ్ కి వెళ్ళాడు. దీనితో ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యానికి గురైనట్టు కుటుంబసభ్యులు చెప్పారు.
ఇక వారు కాసేపు మాట్లాడుకున్నాక డిన్నర్ కి వెళదాము అని చెప్పే సరికి ఆమె ఫ్రెష్ అవ్వడానికి బాత్ రూమ్ కి వెళ్ళడం, అక్కడ ఆమె అపస్మారక స్థితిలో పడివుండటం, ఆ తరువాత కొద్దిసేపటికే ఆమె మరణించడం క్షణాల్లో జరిగిపోయాయి అని తెలుస్తున్నది.
ఏదేమైనా తన భార్య కి షాకింగ్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్న బోనీ కపూర్ కి తన జీవితంలో ఇంత పెద్ద షాక్ తగులుతుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు.