త్వరలోనే ఓ మెగా మల్టీస్టారర్ సెట్ అవుతుందా? పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా వినోధ్య సిథమ్. సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. ఇదో సోషియో ఫాంటసీ సినిమా. దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. రీమేక్ రైట్స్ కోసం ఓ సంస్థ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ హక్కులు చేతికి అందితే పవన్, తేజ్‌లతో పట్టాలెక్కించాలన్నది ప్రయత్నం. తమిళంలో దర్శకత్వం వహించిన సముద్ర ఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తారు. ఇందులో పవన్ ది దేవుడి పాత్ర.
`గోపాల గోపాల`లో పవన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. కాకపోతే.. ఆయన మోడ్రన్ డ్రస్సుల్లోనే ఉంటాడు. ఈ సినిమాలోనూ సేమ్ ఇలానే సాగుతుంది. కాబట్టి పూర్తిగా పౌరాణిక పాత్ర అనుకోలేం. అంతకంటే ముఖ్యంగా పవన్ 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు.కాబట్టి కాల్షీట్లు ఎక్కువగా కేటాయించాల్సిన పనిలేదు. కాబట్టి... పవన్ కీ ఈ ప్రాజెక్టు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చు. మెగా మల్టీస్టారర్ కాబట్టి... ఇక ఫ్యాన్స్‌కి పండగే. త్వరలోనే ఈసినిమా రీమేక్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.