'గాలి వాలుగా' అనిరుధ్‌ ట్రిబ్యూట్‌ అదిరిందిగా

మరిన్ని వార్తలు

'అజ్ఞాతవాసి' సినిమాలోని 'గాలి వాలుగా..' ఆడియో సింగిల్‌ తాజాగా రిలీజై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉందగా, మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఈ సాంగ్‌కి తమిళ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ట్యూన్‌ కట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్యూన్‌కి ఆయనే డాన్స్‌ వేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకాలస్యం చూసేయండి. 

ఇప్పుడీ సాంగ్‌కి ఇంకా క్రేజ్‌ వచ్చేసింది. అనిరుధ్‌ సోలో డాన్స్‌ పర్‌ఫామెన్స్‌, గాలివాలుగా.. ఓ ఊపు ఊపేస్తోంది. నిజంగానే అనిరుధ్‌ పర్‌ఫామెన్స్‌ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో అక్కడక్కడా పవర్‌ స్టార్‌ స్టిల్స్‌, అనిరుధ్‌ రొమాంటిక్‌ చూపులు, ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తున్నాయి.. 

అనిరుధ్‌కి పవన్‌పై ఎంత అభిమానమో ఈ సాంగ్‌ చూస్తుంటే తెలుస్తోంది. తన అభిమానాన్ని అంతా రంగరించి ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు అనిరుధ్‌. తన మ్యూజిక్‌తో టాలీవుడ్‌కి సరికొత్త, ఫ్రెష్‌ మ్యూజిక్‌ని పరిచయం చేస్తున్నాడు అనిరుధ్‌. ఇంతవరకూ వచ్చిన ఈ రెండు ఆడియో సింగిల్స్‌ ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. తమిళంలో ఇప్పటికే పలు చిత్రాలకు మ్యూజిక్‌ అందించాడు. తెలుగులో పవన్‌ సినిమాతోనే పరిచయం అవుతున్నాడు. త్రివిక్రమ్‌ వరుస సినిమాలకు మ్యూజిక్‌ అందిస్తున్నాడు అనిరుధ్‌. 

తమిళంలో ధనుష్‌ నటించిన 'త్రీ' సినిమాలోని కొలవెరి.. సాంగ్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు. అప్పట్లో ఆ పాట ఓ సెన్సేషన్‌. తమిళ సాంగ్‌ అయినా కానీ టాలీవుడ్‌నీ ఉర్రూతలూగించింది. యూత్‌కి సరికొత్త క్రేజ్‌ని తెచ్చి పెట్టింది. ఆ సాంగ్‌ని బేస్‌ చేసుకుని అప్పట్లో చాలా రీమిక్స్‌ సాంగ్స్‌ పుట్టుకొచ్చాయి కూడా. అలాగే ఆ సాంగ్‌కి డిఫరెంట్‌ స్టైల్స్‌లో ఇన్నోవేటివ్‌గా యూత్‌ పలు వీడియో ఆల్బమ్స్‌ని రూపొందించారు. ఇప్పుడు 'గాలి వాలుగా..' సాంగ్‌కి తానే స్వయంగా వీడియో రూపొందించాడు. ఈ ఇన్స్‌పిరేషన్‌తో ఇకపై యూత్‌ ఇంకెన్ని చేస్తుందో చూడాలి మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS